కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు రాజుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయాలు పెరిగిపోతున్నాయి. యువతనే బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి- ఆర్ధర్‌ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అటు బైరెడ్డి వర్గం, ఇటు ఆర్ధర్‌ వర్గంగా వైసీపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు విడిపోయారు. ఇలా జరుగుతున్న విబేధాల కారణంగా ఆర్ధర్‌ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపట్లో ఎమ్మెల్యే ఆర్ధర్‌ ప్రెస్‌మిట్‌ నిర్వహించే అవకాశాలున్నాయి.

దీంతో మీడియా సమావేశం అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆర్ధర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గడ్రెరెడ్డి ప్రతాప్‌రెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించగా చైర్మన్‌ పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.