జగన్ నిర్ణయం తప్పు..కర్ణాటక మంత్రి లేఖ

ఏపీ ప్రభుత్వ పాఠశాలల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ..కర్ణాటక మంత్రి సురేష్ కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై పొరుగు రాష్ర్టాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సురేష్ కుమార్ రాసిన లేఖలో…జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల సరిహద్దుల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఇప్పటికే జగన్ నిర్ణయంపై భాషా వేత్తలు, ప్రముఖుల నుంచి వ్యతిరేకత మవుతుండటంతో…మంత్రి సురేష్ రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదేమైనా జగన్ ఇలా ఆలోచించడం తప్పేనంటున్నారు మేధావులు.

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి సభలోని వైసీపీ సభ్యులు ఆమోదం తెలిపినా… ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సభ్యులు మాత్రం ఊరుకోలేదు. జగన్ నిర్ణయం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇబ్బందులు పడతారని వాదించినా…ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. విద్యార్థులు ఏ మీడియం చదవాలో అది వారి ఇష్టం గానీ…ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని టీడీపీ ప్రశ్నించింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.