ఆ రాష్ట్రంలో ఒక్క రోజే కరోనాతో 141 మంది మృతి

By సుభాష్  Published on  29 Aug 2020 1:23 AM GMT
ఆ రాష్ట్రంలో ఒక్క రోజే కరోనాతో 141 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో మరణమృదంగం మోగిస్తోంది. ఒక్క రోజే 141 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 5,232కు చేరింది. గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో 9,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,09,792కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజాగా నమోదైన కేసుల్లో బెంగళూరులో 3,357 పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరులో 1,18,728కి చేరుకోగా, 35,989 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 2,19,554 మంది కోలుకోగా, 84,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక 747 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

Next Story