కరీంనగర్ పోలీస్ అధికారులకు ఝలక్ ఇచ్చిన హైకోర్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 27 Sept 2019 6:03 PM IST

కరీంనగర్ పోలీస్ అధికారులకు ఝలక్ ఇచ్చిన హైకోర్టు..!

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్‌ సీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి, సీఐ శశిధర్ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష రూ.10వేల జరిమానా విధించింది హైకోర్టు. రమ్మీ ఆడుతున్నారంటూ.. తన రిసార్ట్స్ లోకి వచ్చి వేధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జగపతి రావు హైకోర్టు లో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై గతంలోనే పోలీసులకు పలు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.

కేసు వివరాలు

పుష్పాంజలి రిసార్ట్ పై దాడులు చేసి పోలీసులు వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగపతి రావు కోర్టుకు వెళ్లారు. పేకాట ఆడుతున్నారంటూ గతంలో కూడా రిసార్ట్స్‌ పై దాడులు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని వాపోయారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి వేధిస్తున్నారంటూ కోర్టుకెళ్లారు జగపతి రావు.

Next Story