'సెక్స్'పై కంగనా సంచలన వ్యాఖ్యలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Sept 2019 8:32 PM ISTఢిల్లీ: సంచలనాలకు మారుపేరు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా ఓపెన్‌గా చేయాలనే మనస్తత్వం. హృతిక్‌తో లవ్ దగ్గరు నుంచి ప్రతిదీ ఆమె ఓపెన్‌గానే ఉంటుంది. కామెంట్స్ కూడా ఓపెన్‌గా చేస్తుంది. ఇండియా టుడే రాక్ మైండ్స్ సదస్సులో ఆమె మాట్లాడుతూ..ఆమె పర్సనల్‌కు సంబంధించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆమె ఫష్ట్ కిస్ , ఫస్ట్ రిలేషన్ గురించి కూడా చెప్పారు. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశమన్నారు. అంతేకాదు..పిల్లలను సెక్స్‌కు ప్రోత్సాహించాలని చెప్పారు.
"మీకు ఎప్పుడు శృంగారం కావాలంటే అప్పుడు ఆస్వాదించండి.. దానిని అతిగా చేయరాదు. ఒకప్పుడు శృంగారం కోసమే పెళ్లి. ఒకడికి ఇచ్చి కట్టబెట్టేవారు. అతనికే కట్టుబడి ఉండాలి. చరిత్రలో దండయాత్రలు మూలంగా మన థింక్సింగ్ కూడా అక్కడే ఉన్నాయి. మన పవిత్ర గ్రంధాలు కూడా సెక్స్‌ను ఎంకరేజ్ చేయవు. నేను సెక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నానని తెలిసి మా పేరెంట్స్ షాకయ్యారు.
పిల్లలు శృంగారంలో పాల్గొంటే తల్లిదండ్రులు అడ్డుపడకూడదు. హ్యాపీగా ఉండాలి. " అంటూ చెప్పుకొచ్చారు కంగనా.
కంగనా ప్రస్తుతం తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో నటిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తలైవ అనే పేరు పెడతారని ప్రచారం జరుగుతుంది.