సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మ‌రో వివాదానికి తెర తీసాడు. ఈసారి ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళ్ల‌నుందో..? అనుకున్నారు సినీ ప్రియులు. అలాగే గ‌తంలో వ‌ర్మ జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తీస్తాన‌ని ప్ర‌క‌టించారు. పెళ్లి వ్య‌వ‌స్ధ పై సినిమా తీస్తాన‌న్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ కూడా ఎనౌన్స్ చేసారు. ఇలా చాలా సినిమాలు ప్ర‌క‌టించారు కానీ… అవేవి సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

అలాగే.. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు కూడా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌కే ప‌రిమితం అవుతుంది అనుకున్నారు కానీ… వ‌ర్మ అలా చేయ‌లేదు. చెప్పినంత ప‌ని చేసాడు. సినిమా తీసేందుకు సీరియ‌స్ గా వ‌ర్క్ స్టార్ట్ చేసాడు. ఈ సినిమాలోని ఓ పాటను ట్విట్టర్ వేదికగా వ‌ర్మ‌ విడుదల చేశారు. ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు… అంటూ మొదలైన ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం ఉండటం గమనార్హం. ఇంత‌కీ ఈ పాట‌లో ఏముందంటే…

మనిషి చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకో గలడు.. కానీ, అహం మీద కొడితే.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట ప్రారంభం మొదలుకుని పూర్తయ్యే వరకు టీడీపీ, వైసీపీ నేతల చిత్రాలే ఉన్నాయి. ఆ పాత్రలను నిజ జీవిత పాత్రలతో పోల్చడం యాదృచికం అని, సత్య హరిశ్చంద్రుడి పై ప్రమాణం చేసి వ‌ర్మ‌ చెప్పడం విశేషం. మ‌రి… పాట‌తో సంచ‌ల‌న సృష్టించిన వ‌ర్మ క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమాతో ఇంకేంత సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్నాడో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.