వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఏవరంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది రాంగోపాల్ వర్మ. సినీ ఇండస్ర్టీలో ఏదైన వివాదం చోటు చేసుకుందంటే అది రాంగోపాల్ వర్మ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వివాదాలు జరిగేది ఆయన వల్లనే. ఆయన చుట్టూ కాంట్రవర్సీలు ఉండటం కాదు, కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు పెడతాడు వర్మ. హిట్ ఫ్లాపులతో పనిలేకుండా వర్మ చేసే ప్రతీ పని సంచలనమే. ఇప్పుడు కూడా ఇలాంటి పనే ఒకటి చేస్తున్నాడు. ఈ మధ్య హిందీపై ఫోకస్ తగ్గించి.. తెలుగు ఇండస్ట్రీపై దృష్టి సారించారు వర్మ.

ఈ దర్శకుడు ఇప్పుడు మరో సంచలన సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. ఇప్పటికే చాలా సెన్సేషనల్ సినిమాలు చేసిన వర్మ.. ఇప్పుడు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో ఓ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. పోస్టర్ కూడా విడుదలతో పాటు పాటలను కూడా విడుదల చేసేశాడు. ఈ నెల‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా సంచలనాలు రేపుతుంది. విడుదలైన దగ్గరి నుంచి వివాదాలతో కాపురం చేస్తుంది కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్. చంద్రబాబు, జగన్, పవన్ ఇలా ఏ ఒక్కర్ని వదిలిపెట్టకుండా అందరితోనూ ఆడేసుకున్నాడు. దానిపై చాలా రచ్చ కూడా జరుగుతోంది. ఇంకో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో శ్రీ రెడ్డి కూడా న‌టిస్తోంద‌ట‌. ఈమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ఆమె సొంత పాత్రలో ఆమె నటించింద‌ని ప్రచారం జరుగుతోంది.

కచ్చితంగా ఈ కారెక్టర్ సినిమాలో రచ్చ రచ్చ చేస్తుందని నమ్ముతున్నాడు వర్మ. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే శ్రీ రెడ్డిని తన సినిమాకు హెల్ప్ అవుతుందని భావించాడ‌ట‌. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు తాను కోరుకున్న రెస్పాన్స్ భారీగా రావడంతో వర్మ ఇక సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా తోడయ్యే సరికి మరింత రేంజ్ పెరిగేలా కనిపిస్తుంద‌ని భావిస్తున్నాడు. టైటిల్ చూస్తుంటేనే మరో వివాదం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరోవైపు వర్మ మాత్రం తనను కొట్టినా చంపినా తాను అనుకున్నదే చేస్తానంటున్నాడు.

ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలతో సినిమా మీద అంచనాలు పెంచేశాడు వర్మ. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా ఈ సినిమాతో నటిస్తుందన్న ప్రచారం జరుగుతుండటంతో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మరింత వివాదాస్పదమయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలకు తెరలేపుతుందో వేచి చూడాల్సిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.