యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘భార‌తీయుడు-2’. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా ప్రారంభమ‌వ‌డం… ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాలతో వాయిదా ప‌డ‌డం తెలిసిందే. అడ్డంకుల‌న్నింటినీ తొల‌గించుకుని.. ఇటీవ‌ల మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ఈ భారీ చిత్రం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Image result for anil kapoor

ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనిల్ కపూర్ పేరు తాజాగా తెర పైకి వచ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకి అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ లో మార్పులు జరగడం వలన, ఆయన డేట్స్ కుదరక తప్పుకున్నాడట.

Image result for ajay devgan

దాంతో దర్శక నిర్మాతలు అనిల్ కపూర్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని సమాచారం. ఇందులో క‌మ‌ల్ స‌ర‌స‌న కాజల్ న‌టిస్తుంది. రకుల్ .. సిద్ధార్థ్ .. ఐశ్వర్య రాజేష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.