నేడు విలక్షణ నటుడు కమల్‌ హాజన్ బర్త్ డే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 8:25 AM GMT
నేడు విలక్షణ నటుడు కమల్‌ హాజన్ బర్త్ డే

చెన్నై : కమల్ హాసన్ భారతీయ చలన చిత్ర రంగంలో మరువలేని పేరు. ఏ పాత్ర వేసినా న్యాయం చేసే గొప్ప నటుడు. మరో చరిత్ర, భారతీయుడు, స్వాతి ముత్యం వంటి చిత్రాల్లో నటించి తనకు తిరుగులేదని అనిపించుకున్నాడు. నవంబర్‌ 7 లోక నాయకుడి పుట్టిన రోజు. 65వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోడానికి కమల్‌ తన స్వగ్రామం పరమక్కుడి వెళ్లారు. అక్కడ తన 60 ఏళ్ల సినీ ప్రస్థానానికి జ్ఞాపకంగా మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు.

ఇక శ్రుతి హాసన్‌ సైతం తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకమన్నారు. బాపూ మీ 60 ఏళ్ల సినీ ప్రయాణానికి ఓ నిదర్శనం. పుట్టిన రోజుకి మన స్వగ్రామానికి రావడం సంతోషం. మీ జీవితంలో మేము కూడా భాగమయ్యాం. లవ్‌ యూ లాట్స్‌ పప్పా’ అంటూ విషేస్‌ తెలిపారు. కూతుళ్లు శ్రుతి హాసన్‌, అక్షర హాసన్‌తో సహా అన్నయ చారు హాసన్‌ స్వంత గ్రామానికి వెళ్లారు. తండ్రి శ్రీనివాసన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కమల్‌ 1954లో తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమక్కుడిలో జన్మించారు. స్వతహాగా తమిళ నటుడైనా తన న టనతో దేశమంతటికీ సుపరిచితులయ్యారు. బాల నటుడిగా నటించిన కలకత్తూర్‌ కన్నమ్మ మొదటి చిత్రానికే కమల్‌ జాతీయ పురస్కరం అందుకున్నారు. సినిమా రంగంలో కమల్ చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళాకారుల్లో మాణిక్యం బిరుదుతో సత్కరించింది. పద్మ శ్రీ బిరుదుతో కేంద్రం కమల్‌ను గౌరవించింది.

Next Story