అఖిల్ హీరోయిన్.. ఓ హీరో ల‌వ్ లో ప‌డిందా.? ఇంత‌కీ.. ఎవ‌రా హీరో.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 1:12 PM GMT
అఖిల్ హీరోయిన్.. ఓ హీరో ల‌వ్ లో ప‌డిందా.? ఇంత‌కీ.. ఎవ‌రా హీరో.?

అక్కినేని అఖిల్ తో క‌లిసి 'హ‌లో' సినిమాలో న‌టించి... తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి దంప‌తుల ముద్దుల కూతురే క‌ళ్యాణి. 'హ‌లో' సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే ఆక‌ట్టుకున్న క‌ళ్యాణి.. ఆ త‌ర్వాత 'చిత్ర‌ల‌హ‌రి' సినిమాతో మ‌రో విజ‌యం సొంతం చేసుకుంది. తాజాగా కోలీవుడ్ లో కూడా ఆమె ఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే.. కళ్యాణి ల‌వ్ లో ప‌డింది అనే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అదీ కూడా ఓ హీరోతో అని తెలియ‌గానే.. ఎవ‌రా హీరో అని ఆరా తీయ‌డం స్టార్ట్ చేసారు. తీరా తెలిసింది ఏంటంటే... ఆమె ప్రియుడు మరెవరో కాదు. మ‌ల‌యాళ అగ్ర హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్. మోహన్ లాల్, ప్రియదర్శన్ లు ఇద్ద‌రూ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులు. వీరి స్నేహం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రణవ్, కళ్యాణి లకు కూడా చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఇప్పుడు అది లవ్ ట్రాక్ పైకి ఎక్కింది. అయితే.. తనను ల‌వ్ లో ఉన్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల పై కళ్యాణి ఇటీవల స్పందించింది. ఇంత‌కీ ఏమ‌న్న‌దంటే... తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న మాట నిజమేనని.. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే.. అది ఎప్పుడు అనేది మాత్రం చెప్ప‌లేదు.

Next Story
Share it