ప్రజలందరికి ధన్యవాదాలు..

By Newsmeter.Network  Published on  25 Jan 2020 11:41 AM GMT
ప్రజలందరికి ధన్యవాదాలు..

మున్నిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జయకేతనం ఎగుర వేసింది. 120మున్సిపాలిటీలకు గానూ 102 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు కవిత అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ !! జై టీఆర్ఎస్ !! జై కేసీఆర్ !! అని ట్వీట్ చేశారు.Next Story
Share it