'బిగ్‌బాస్-4‌'లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటి..!

By సుభాష్  Published on  30 Aug 2020 9:22 AM GMT
బిగ్‌బాస్-4‌లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటి..!

తెలుగులో స్టార్‌మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో బాగ్‌బాస్‌ షో.. మూడు సీజన్లు ముగించుకుని సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి నాలుగో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేసి వారందరినీ ఓ హోటల్‌లో క్వారంటైన్‌ చేశారని, వారికి కరోనా పరీక్షలు చేసిన తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి తీసుకురాన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాగ్‌బాస్‌-4లో పాల్గొనేవారి నిర్వాహకులు అధికారికంగా ప్రకటించకపోయినా.. వారి పేర్లు సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి. హౌస్‌లో ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కంటెస్టెంట్ల పేర్లు సైతం సోషల్‌ మీడియాలో కోడై కూస్తోంది. వారిలో నటి కల్పిత గణేష్ పేరు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ ఎంట్రీపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ బిగ్‌బాస్‌ షోలో ఎప్పటికీ నన్ను చూడబోరు అంటూ కల్పిన తెలిపారు. భవిష్యత్తులో కూడా తాను ఈ షోలో పాల్గొనని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌కు కూడా మన్మధుడు నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు.ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, కల్పిత 'ప్రయాణం' సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటించిన టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సమంతకి అక్కగా నటించింది. రీసెంట్‌గా 'వెంకీమామ' మూవీలో కూడా కనిపించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. తెరపై పద్దతిగా, సాఫ్ట్‌గా కనిపించే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో మాత్రం షాకిస్తుంటుంది. హాట్‌ హాట్ ఫోటోలను సైతం పోస్టు చేస్తూ యువకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ తమిళ చిత్రాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తోన్నట్లు తెలుగుస్తోంది.

Next Story