ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌

By సుభాష్  Published on  30 Aug 2020 2:25 AM GMT
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌

కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజురోజుకు మెరుగు పడుతోందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బాలుకు ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

అలాగే వైద్యులు అడిగిన దానికి స్పందిస్తున్నారని, వైద్య బృందం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో వైపు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. నాన్న ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోంది. గత కొన్ని రోజుల కిందట విషమంగా ఉన్న నాన్న ఆరోగ్యం వైద్యుల కృషి వల్ల చాలా మెరుగుపడిందన్నారు.

Next Story