'అప్పుడు - ఇప్పుడు' టీమ్ పై కళాతపస్వి ప్రశంసలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 12:53 PM GMT
యు.కె.ఫిలింస్ నిర్మిస్తొన్న చిత్రం 'అప్పుడు-ఇప్పుడు'. ఈ చిత్రానికి ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాతలగా..చలపతి పువ్వల దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సుజన్, తనీష్క్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా చిత్రంలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ కన్పించనున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా ఇది తెరకెక్కనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతోంది. దసరా కానుకగా చిత్ర బృందం విడుదలై ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతులమీదుగా తొలి పాట విడుదలైంది. ఈ పాటకు అద్భుత స్పందన వస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
ఈ సందర్భంగా లెజెండ్ కె.విశ్వనాథ్ మాట్లాడుతూ:
''ఫీల్ గుడ్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ తగ్గదు. అప్పుడు ఇప్పుడు కథాంశం ఆ తరహానేన్నారు. నవతరం నటీనటులు ఇంకా రాణించాలి అభిప్రాయపడ్డారు. రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారనే పోస్టర్లు చెబుతున్నాయి. నా చేతులమీదుగా విడుదలైన పాట బాణీ, సంగీతం ఆకట్టుకుంది. ఈ చిత్రంతో దర్శకనిర్మాతలు.. నటీనటులకు పేరు రావాలి'' అని అన్నారు.
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ :
'' ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారని తెలిపారు. మేకింగ్ లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా పేర్కొన్నారు. అలాగే ఫాల్కే గ్రహీత కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజవ్వడం ఆనందంగా ఉంది'' అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ:
''విజయదశమికి రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చిందన్నారు. దర్శకుడు చలపతి పువ్వల కొత్తవారైనా ఒక అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను చాలా బాగా తెరకెక్కించారన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ చేశామన్నారు. ఎన్నో సంగీత ప్రధాన చిత్రాల్ని, కళాఖండాల్ని తెరకెక్కించిన కళా తపస్వి చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు నిర్మాత తెలిపారు.