టాలీవుడ్‌లో గాసిప్స్ సహజం. కాని..వాటిని పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటారు. ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ ఉందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ గాసిప్‌ను అనుష్క, ప్రభాస్ ఇద్దరూ ఖండించారు.

కాజల్ మాత్రం ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యతగా సినీ తారలతో ఓ షోను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ప్రశ్నలకు కాజల్ ఆసక్తికర సమాధానం చెప్పింది. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారా అనే ప్రశ్నకు..కాజల్ యస్ అనే సమాధానం చెప్పింది.

రామ్ చరణ్, తారక్‌, ప్రభాస్‌ల్లో ఎవరిని చంపుతారు?, ఎవరితో రిలేషన్‌లో ఉంటారు?, ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని మంచు లక్ష్మి ప్రశ్నించింది.ఈ ప్రశ్నలకు మంచు లక్ష్మి సమాధానం ఇస్తూ…రామ్ చరణ్ ని చంపేస్తానని, తారక్‌ రిలేషన్‌తో ఉంటానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ప్రభాస్ బ్యాచిలర్ కావడంతో కాజల్ ఈ ఆరు అడుగుల అందగాడిపై మనసు పడి ఉంటుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.