సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కాజల్ జంట ఫోటోలు
By సుభాష్ Published on 2 Nov 2020 1:07 PM ISTనటి కాజల్ అగర్వాల్ గత శుక్రవారం గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా కాజల్ వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి వివాహానికి సంబంధించిన ఫోటోల గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు ఓ రెండు ఫోటోలను కాజల్, ఆమె చెల్లి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో నవదంపతులిద్దరూ ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించారు. ఇక కాజల్ షేర్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు శుభాకాంక్షులు చెబుతున్నారు.
కాగా, ఈ ముద్దుగుమ్మ వివాహనం అక్టోబర్ 30న ముంబాయిలో జరిగింది. జీవితంలోని ఈ కొత్త ఆరంభం కోసం మే ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూసున్నాం. మీ అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నా.. ఇన్నేళ్లుగా మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిన విషయం తెలిసిందే. ఈ కొత్త ప్రయాణంలో మేం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. పెళ్లి తర్వాత కూడా నేను నా నటనను కొనసాగిస్తాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాను అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on Nov 1, 2020 at 7:23pm PST
View this post on Instagram
A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) on Nov 1, 2020 at 6:34pm PST