చందమామ కు అరుదైన గౌరవం
By రాణి Published on 5 Feb 2020 11:47 AM GMT'చందమామ' కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె చోటు దక్కించుకుంది. చందమామ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం అక్కడ కొలువుదీరింది. ఈ మైనపు బొమ్మను కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆవిష్కరించింది. అనంతరం ఆ బొమ్మ పక్కనే నిలబడి ఫోజులిచ్చిందీ అమ్మడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోల్డెన్ కలర్ డ్రస్ లో ఉన్ ఈ మైనపు బొమ్మ నెటిజన్లను కట్టిపడేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకూ ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరగా...అగ్రకథానాయికల్లో ఒకటైన కాజర్ వారి పక్కన చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చందమామ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. మోసగాళ్లు, ఇండియన్ 2 తో పాటు బాలీవుడ్ లో ముంబయిసాగా చిత్రాలతో బిజీ బిజీగా ఉంటోంది.
Next Story