చందమామ కు అరుదైన గౌరవం

By రాణి
Published on : 5 Feb 2020 5:17 PM IST

చందమామ కు అరుదైన గౌరవం

'చందమామ' కాజల్ అగర్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె చోటు దక్కించుకుంది. చందమామ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం అక్కడ కొలువుదీరింది. ఈ మైనపు బొమ్మను కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆవిష్కరించింది. అనంతరం ఆ బొమ్మ పక్కనే నిలబడి ఫోజులిచ్చిందీ అమ్మడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గోల్డెన్ కలర్ డ్రస్ లో ఉన్ ఈ మైనపు బొమ్మ నెటిజన్లను కట్టిపడేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకూ ప్రభాస్, మహేశ్ బాబు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరగా...అగ్రకథానాయికల్లో ఒకటైన కాజర్ వారి పక్కన చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చందమామ తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. మోసగాళ్లు, ఇండియన్ 2 తో పాటు బాలీవుడ్ లో ముంబయిసాగా చిత్రాలతో బిజీ బిజీగా ఉంటోంది.

Kajal Agarwal In Madam Tussads 2 Kajal Agarwal In Madam Tussads 3 Kajal Agarwal In Madam Tussads 4

Next Story