హైదరాబాద్‌: కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు కర్నూల్‌ – సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ(హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను  సోమవారం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో18 మంది ప‌్రయాణికులకు గాయాలయ్యాయి.  అయితే ఈ ఘటనలో క్యాబిన్‌లో ఇరుక్కున్న లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అతి కష్టం మీద బయటకు తీశాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌ను కేర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో పైలట్‌ చంద్రశేకర్‌ కుడికాలుకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఇవాళ పైలట్‌ కుడి కాలును తొలగించినట్లు కేర్‌ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. సాయంత్రం 4 గంటలకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.