బోటు బయటకు తీసే పనులు ప్రారంభం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sept 2019 4:13 PM IST
బోటు బయటకు తీసే పనులు ప్రారంభం

తూ.గో. జిల్లా: తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పాపి కొండల మధ్య జరిగిన ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల చెందిన వారు 30 మందికి పైగా చనిపోయారు. ఇంకా 10కిపైగా మృతదేహాలు దొరకాల్సి ఉంది.అయితే.. కొన్ని మృతదేహాలు బోట్లోనే చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే బోటు వెలికితీసే పనులు ప్రారంభించారు. బోటు బయటకు తీయలేమని ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్ బృందాలు వెనక్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే...స్థానికులతోనే బోటును బయటకు తీసేందుకు అధికారులు యత్నాలు ప్రారంభించారు.

Next Story