ఈ గ్రామం “దిశ” చూపిస్తోంది... అమ్మాయిల్ని ఏడిపిస్తే నో ఎంట్రీ..!

By అంజి  Published on  4 Dec 2019 6:08 AM GMT
ఈ గ్రామం “దిశ” చూపిస్తోంది... అమ్మాయిల్ని ఏడిపిస్తే నో ఎంట్రీ..!

మనమ్మాయి దిశకు పట్టిన దుర్గతి ఇంకే అమ్మాయికీ పట్టకూడదని ఆ ఊరి వాళ్లు నిర్ణయించుకున్నారు. అమ్మాయిల్ని ఏడిపించే కామపు కుక్కలకు, తామేం చేస్తున్నామో తెలియకుండా పోయే తాగుబోతులకు తమ ఊళ్లోకి ప్రవేశం లేదని ఆ గ్రామ పంచాయితీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో మదమెక్కిన మేకవన్నె పులులను రానీయొద్దని నిర్ణయం తీసుకోవడమే కాదు, అనుమానితులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చింది. ఊరు ఊరంతా – ఆడామగా, యువకులు, వృద్ధులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే వారిని ఊరి నుంచి తరిమివేయాలని కూడా వారు నిర్ణయించుకున్నారు.

అమ్మాయిలను గౌరవించడం, మర్యాదగా ప్రవర్తించడం వంటి విషయాల్లో యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. వన్నారం సాధించిన ఈ విప్లవం గురించి తెలుసుకునేందుకు పొరుగు ఊళ్లకు చెందిన వారు వచ్చి చూసి వెళ్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే గత మూడు నెలల్లో ఈ గ్రామంలో ఈవ్ టీజింగ్ జరిగిన దాఖలాలే లేవు.

Next Story
Share it