హైదరాబాద్: ప్రముఖ హీరో బాలకృష్ణ డైలాగులతో అలరించిన ‘జూనియర్ బాలకృష్ణ’గా పేరు తెచ్చుకున్న గోకుల్ సాయి కృష్ణ మృతి చెందాడు. గత రెండ్రోజులుగా సాయి కృష్ణ జ్వరంతో బాధ పడుతున్నాడు. దీంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే సాయి కృష్ణ మృతి చెందాడు. దీంతో బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా సాయి మృతికి సంతాపం తెలిపారు. గోకుల్ సాయి కృష్ణది చిత్తూరు జిల్లా మదనపల్లి. యోగేంద్ర, సుమంజలిల రెండో కుమారుడు సాయి కృష్ణ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.