ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2019 3:03 PM GMT
ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే... ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో ఓ భారీ సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. అట్లీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తుండ‌డంతో ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడ‌ట ఎన్టీఆర్. వీరిద్ద‌రు క‌లిసి అర‌వింద స‌మేత సినిమా చేసారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది.

ఆర్ఆర్ఆర్ ప్యాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి... ఎన్టీఆర్ చేసే త‌దుప‌రి చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా స్ధాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందుక‌నే త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్న మూవీని దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Next Story