టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, న‌టుడు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి రేపు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న ఆయ‌న‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళుల‌ర్పిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా అక్క‌డ‌కి వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట నంద‌మూరి సోద‌రులు.

త‌మ అభిమాన హీరోలు ఆ ప్రాంతానికి వ‌స్తున్నార‌ని తెలిసిన అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌కి భారీగా చేరుకునే అవ‌కాశం ఉంది. అలా జ‌రిగే క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో తాము ఇంటి వ‌ద్ద ఉండి తాత‌య్య‌కి అశ్రు నివాళులు అర్పిస్తే బాగుంటుంద‌ని ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇక వీరి నిర్ణ‌యం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు నెటీజ‌న్లు. సెలబ్రెటీలు ఇలా ఆద‌ర్శంగా నిలిస్తే ఖ‌చ్చింతంగా వాళ్ల‌ను చూసి చాలా మందిలో మార్పు వ‌స్తుంద‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.