ఆ ఆల్‌రౌండర్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఎందుకంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Jan 2020 7:21 AM GMTసౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జేపీ డుమిని క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న డుమిని.. ఆ తర్వాత ఆయా దేశాల్లో టీ20 లీగ్స్ ఆడుతున్నాడు. అయితే.. ఇకపై తాను అన్ని ఫార్మాట్‌లలో క్రికెట్ ఆడనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో.. 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు డుమిని ముగింపు పలికినట్లయింది.
శ్రీలంకతో 2004 ఆగస్టులో నెలలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డుమిని.. దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన డుమిని.. లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. ఇక స్పిన్ బౌలింగ్‌తోనూ చాలా సందర్భాలలోనూ ఆకట్టుకున్నాడు.
రిటైర్మెంట్ సందర్భంగా మాట్లాడుతూ.. యువ క్రికెటర్లకి అవకాశమివ్వాలనే ఉద్దేశంతో తాను క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. టీ20 మ్యాచ్‌లు ఆడితే..? ఫ్రాంఛైజీలు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తాయి. కానీ.. నేను మ్యాచ్‌లు ఆడేందుకు బలమైన కారణం లేదు. కాబట్టి.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న యంగ్ క్రికెటర్స్ కోసం నేను వైదొలుగుతున్నానని డుమిని తెలిపాడు.