సౌత్ కరోలినా ప్రైమరీలో 'బిడెన్' గెలుపు

By అంజి  Published on  2 March 2020 3:30 AM GMT
సౌత్ కరోలినా ప్రైమరీలో బిడెన్ గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహిస్తున్న ప్రైమరీల్లో దేశ మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ తొలి విజయాన్ని నమోదు చేశారు. శనివారం దక్షిణ కరోలైనాలో జరిగిన ప్రైమరీలో ఆయన గెలుపొందారు. దీంతో సూపర్‌ ట్యూజ్‌డే పేరిట మంగళవారం 15 కీలక రాష్ట్రాల్లో జరిగే ప్రాథమిక ఎన్నికలపై అందరి దృష్టి పడింది.

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోరులో అయోవా, న్యూహాంప్‌షైర్‌, నెవడాలో వరుసగా ఓటమి పాలైన జోయ్ బిడెన్‌ శనివారం నాటి సౌత్‌ కరోలినా ప్రైమరీస్‌లో విజయం సాధించాడు. ఈ గెలుపుతో అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వ రేసులో బిడెన్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. సౌత్‌ కరోలినాలో ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుండే బిడెన్‌ టాప్‌ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచారు. గత మూడు ప్రైమరీలలో ఆయన నాలుగో స్థానానికి పరిమితమైన నేపథ్యంలో ఈ గెలుపు బిడెన్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చినట్టే.

దాదాపు 52 లక్షల మంది జనాభా వున్న సౌత్‌ కరోలినా రాష్ట్రం డెమొక్రాట్స్‌ అభ్యర్థి ఎంపికలో తొలి దక్షిణాది రాష్ట్రంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడి జనాభాలో 30 శాతం మంది నల్ల జాతీయులు కాగా, డెమొక్రాటిక్‌ పార్టీ సంప్రదాయక ఓటర్లు 60 శాతం పైగానే వున్నారు. సూపర్‌ ట్యూస్‌డే ముందు జరిగిన చివరి ప్రైమరీ కావటంతో సౌత్‌ కరోలినా కీలకంగా మారింది. ఇక సూపర్‌ ట్యూస్‌డేలో 14 రాష్ట్రాలలో ఒకేసారి ప్రైమరీలు జరగనుండటంతో ట్రంప్‌ ప్రధాన ప్రత్యర్థి ఎవరన్న విషయం తేలిపోతుంది.

Next Story