రిలయన్స్ జియో కొంతకాలం నుంచి కాలర్ ట్యూన్ కి కూడా ఛార్జీలు వసూలు చేస్తుండగా..ఎయిర్ టెల్ మాత్రం ఫ్రీ కాలర్ ట్యూన్స్ ఇచ్చింది. కాగా..దేశంలో కరోనా వైరస్ వచ్చిన నేపథ్యంలో జియో కరోనా పై అవగాహనకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో..ఉచిత కాలర్ ట్యూన్ ను రూపొందించింది. శనివారం నుంచే ఈ కాలర్ ట్యూన్ అందుబాటులోకి వచ్చింది. ఏ నెట్ వర్క్ నుంచైనా జియోకు కాల్ చేస్తే..ఈ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. ఇందులో కరోనా రాకుండా తీసుకోవాల్సిన ఆరోగ్య సలహాలు, సూచనలతో పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందుపరిచారు.

ఈ ఆటోమెటిక్ కాలర్ ట్యూన్ ను ఏ జియో వినియోగదారుడైనా ఉచితంగా పొందొచ్చు. అయితే ఇప్పటికే తమకు నచ్చిన కాలర్ ట్యూన్లను ఎంపిక చేసుకున్నవారికి మాత్రం ఇవి లభించవు. కరోనాపై అవగాహన పెంచేందుకు శుక్రవారం ముంబైకి చెందిన హాప్టిక్ అనే స్టార్టప్ కంపెనీ కూడా ఇదే తరహాలో వాట్సాప్ పై ఆటోమేటెడ్ చాట్ బాట్ ను అందుబాటులోకి తెచ్చింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.