దొంగబంగారం కొన్న వ్యాపారి ఆత్మహత్య

By రాణి  Published on  26 Feb 2020 9:41 AM GMT
దొంగబంగారం కొన్న వ్యాపారి ఆత్మహత్య

దొంగ బంగారం కొన్న కేసులో పోలీసులు విచారిస్తున్న ఓ బంగారం వ్యాపారి విచారణ చేస్తూండగానే భవనం పైనుంచి దూకి చనిపోయాడు. సదరు వ్యాపారి నాసిక్ కు చెందిన వాడు. మహబూబ్ నగర్ కు చెందిన దొంగ బంగారాన్ని ఆయన కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బంగారం దొంగ ఇచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్, మహబూబ్ నగర్ పోలీసులు విజయ్ బిరారే అనే వ్యాపారిని ప్రశ్నించారు. ఇంటరాగేషన్ కొనసాగుతూండగానే ఆయన పరుగులు తీసి గెస్ట్ హౌస్ పైనుంచి కిందకు దూకేశాడు. దీనితో ఆయన చనిపోయాడు.

పోలీసుల కథనం ప్రకారం..బంగారం, వజ్రాల దొంగతనంలో ఘనకీర్తి ఉన్న సంతోష్ అలియాస్ ప్రకాశ్ షిండేను ఇటీవలే మహబూబ్ నగర్ లో పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్, శంషాబాద్ పోలీసులు మహబూబ్ నగర్ పరిధిలో షిందేని ఫిబ్రవరి 15 న అరెస్టు చేశారు. దొంగతనాలు జరిగిన పలు చోట్ల అతని వేలి ముద్రలు దొరికాయి. వాటి ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. షిందే 1990 నుంచి దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. అయితే పోలీసులను బురిడీ కొట్టించేందుకు మధ్యలో తాను చనిపోయినట్టు ఒక డెత్ సర్టిఫికేట్ ను కూడా సృష్టించాడు. అయితే ఇటీవలే అతడు బ్రతికున్నాడని తెలిసిన పోలీసులు చనిపోయాడని భావించిన తరువాత కూడా 24 దొంగతనాలు చేశాడు. అరెస్టయిన తరువాత పోలీసు విచారణలో తాను దొంగిలించిన రెండు కిలోల మేరకు బంగారాన్ని విజయ్ బిరారే కు అమ్మినట్టు అతను ఒప్పుకున్నాడు. దీంతో విజయ్ బిరారేను నాసిక్ లోని ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో విచారించారు. ఈ సందర్భంలోనే అతను దూకి బిరారే చనిపోయాడు. నీరు తాగుతానని చెప్పి గదినుంచి బయటకి వచ్చి అతను ఈ పనిని చేశాడని పోలీసులు చెబుతున్నారు.

ఇక బిరారే కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల మితిమీరిన దెబ్బల వల్లే అతడు చనిపోయాడని అంటున్నారు. వారు మృత దేహానికి పోస్ట మార్టమ్ కూడా చేయకుండా అడ్డుకుని సైబరాబాద్ పోలీసులపై కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Next Story