జెట్‌ కొత్త బిడ్ల ఆహ్వానం.. హైదరాబాద్‌ సంస్థ ఆసక్తి..!

హైదరాబాద్‌: ఒకప్పుడు దేశీయవిమాన రంగంలో ఓ వెలుగు వెలిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ.. ఆ తర్వాత రుణ సంక్షోభంత దివాళా తీసింది. రూ.8,500 కోట్లకుపైగా అప్పులు కావడంతో విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. అయితే తాజాగా జేట్‌ ఎయిర్‌వేస్‌ను చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తెంది. అందులో హైదరాబాద్‌కు చెందిన టర్బో ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం. జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీస్తున్నదని, ఇంకా చివరి నిర్ణయానికి మాత్రం రాలేదని వ్యాపార విశ్లేషక్‌ వర్గాలంటున్నాయి. జెట్‌ను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని విమానయాన దివాల పరిష్కార నిపుణుడు ఆర్‌పీ ఆశిష్ చావ్‌చరయా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తెలిపారు.

ట్రూస్టార్‌ పేరుతో వచ్చే ఏడాది విమాన సేవలను ప్రారంభించాలనుకోంటోన్న టర్బో ఏవియేషన్‌.. 10 రోజుల కిందట బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.10 కోట్ల ఫండింగ్‌ సేకరించింది. జెట్‌ ఎయిర్‌ వేస్‌ దక్కించుకోవడానికి కొత్తగా ఆసక్తి గల కంపెనీలను ఆహ్వానించాలని ఎయిర్‌లైన్స్‌ రుణదాతల కమిటీ నిర్ణయించింది. కొత్త బిడ్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే సీఓసీనీ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆదేశించింది. నిన్న ఈ సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు కంపెనీ ఇచ్చింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు చేయాలనుకునేవారు జవనరి 6కల్లా ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేయాలని, ఫిబ్రవరి 8 నాటికి దివాలా పరిష్కర ప్రణాళికను సమర్పించాలని పేర్కొంది.

రుణ సంక్షోభం పెరిగిపోవడంతో 2019 సంవత్సరం ఏప్రిల్‌ నెలలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సేవలను నిలిపివేసింది. దీంతో రుణాలు ఇచ్చిన దాతలు, బ్యాంకులు తమ రుణాలను రాబట్టుకునేందుకు దివాల పరిష్కర చర్యలను చేపట్టాయి. దీనిలో భాగంగా జెట్‌ దివాలా పరిష్కరంలో భాగంగా ట్రిబ్యునల్‌ ఇచ్చిన మొదటి 180 రోజుల గడువు ముగిసింది. కేవలం ఇప్పటి వరకు సినర్జీ గ్రూప్‌ మాత్రమే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసింది. అయితే కొనుగోలు చేసేందుకు మరింత సమయం కావాలని కోరింది. దీంతో ట్రిబ్యునల్‌ మరో 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ మేరకు సీఓసీ కొత్త బిడ్ల దరఖాస్తులకు ఆహ్వానాలు పలికింది.

ఈ దఫాలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ కొనుగోలుకు హిందుజా గ్రూప్‌ బిడ్‌ దాఖలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మొదట్లో ఎయిర్‌వేస్‌ రుణదాతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు, హిందూజా గ్రూప్‌ను కూడా సంప్రదించారు. మొదట్లో జెట్‌ఎయిర్‌వేస్‌లో ఆర్థిక అవకతవకలపై కేసు నడుస్తున్న నేపథ్యంలో హిందుజా కంపెనీ రిస్క్‌ తీసుకోలేదు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్