అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం వెళ్తున్న జేసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాపురంలో టీడీపీ నేత ఇంటి చుట్టూ, వైసీపీ నేత నాపరాళ్లు నాటారు. ఈ విషయమై ఆ టీడీపీ నేతకు అండగా నిలిచేందుకు.. జేసీ దివాకర్‌రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆయనను వెళ్లకుండా అడ్డుపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డిని బలవంతంగా బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన.. తర్వాత అనంతపురంలో వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు పరస్పర వివాదాలు జరుతున్నాయి. వైసీపీ నేతలు కావాలనే మాపై కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మానవహక్కుల కేంద్రానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story