సీఎం జగన్‌పై జేసీ ఘాటు వ్యాఖ్యలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 7:17 AM GMT
సీఎం జగన్‌పై జేసీ ఘాటు వ్యాఖ్యలు..!

అనంతపురం: సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలను సీఎం వైఎస్‌ జగన్‌ టార్గెట్‌ చేసుకున్నారని జేసీ ఆరోపించారు. జగన్‌ హద్దు మీరి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. పార్టీలో చేరితే కేసులుండవని.. లేదంటే కేసులు పెడతామని అధికార పార్టీ నేతలు బెదరిస్తున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌పై జేసీ దివాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. కొందర్ని ఆర్థికంగా, మానసికంగా శిక్షిస్తున్నారని.. చింతమనేనిపై రోజుకో కేసు పెడుతున్నారని జేసీ మండిపడ్డారు.

Next Story
Share it