శర్వానంద్ తో సమంత 'ప్రాణం'.. సూపర్ !

By రాణి  Published on  21 Jan 2020 1:23 PM GMT
శర్వానంద్ తో సమంత ప్రాణం.. సూపర్ !

గత ఏడాది విడుదలై డీసెంట్ కలెక్షన్స్ తో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ్ రీసెంట్ క్లాసిక్ మూవీ '96' తెలుగులో 'జాను' గా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో పర్ ఫెక్ట్ స్టార్ విజయ్ సేతుపతి, స్లిమ్ డాల్ త్రిష జంటగా నటించగా..తెలుగు రీమేక్ కోసం యంగ్ హీరో శర్వానంద్, అక్కినేని సమంత జోడీ కట్టారు. అయితే ఈ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ నుండి ఫస్ట్ సాంగ్ 'ప్రాణం' లిరికల్ వీడియో రిలీజ్ అయింది.

ఈ మెలోడీ సాంగ్ ఫీల్ ఎమోషన్ తో సాగుతూ మనసును హత్తుకునేలా ఉంది. దీనికితోడు సరళమైన పదాలతో అర్ధవంతమైన భావాలతో శ్రీమణి అందించిన సాహిత్యం, అలాగే గోవింద్ వసంత్ అందించిన ఫీల్ గుడ్ ట్యూన్ కూడా సాంగ్ ను మరో స్థాయిలో నిలబెట్టింది. మొత్తానికి ఈ సాంగ్ నెటిజన్లతో పాటు మ్యూజిక్ లవర్స్ ను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉండి, మెయిన్ గా ఎడారిలో వెళ్తున్న నాలుగు ఒంటెలు.. వాటికీ ఎదురుగా శర్వానంద్..అలా మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై ఇంట్రస్ట్ ను పెంచింది.

ప్రస్తుతం ఈ రీమేక్ మూవీ..షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చుస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

'ప్రాణం' లిరికల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story