జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 15 Nov 2019 1:26 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన

అమరావతి : జనసేన్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో పలువురు నేతలను కలవనున్నట్లు సమాచారం. కాగా.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన పలు రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతోంది.

అయితే పవన్ కళ్యాణ్ ఏపీలో ఇసుక కొరతపై లాంగ్‌ మార్చ్‌ చేరసి.. ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. కాగా.. ఆ పార్టీ వర్గాలు మాత్రం ఢిల్లీలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్నారని చెబుతున్నారు. మరొవైపు ఏపీలో శక్తిమంతమైన పార్టీగా మారాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Next Story