జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

By సుభాష్  Published on  18 July 2020 2:01 AM GMT
జమ్మూలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున షోపియాన్‌ జిల్లాలోని అమిషపొర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు వారి కాల్పులను తిప్పికొట్టాయి. ఎదురెదురుగా కాల్పులు చోటో చేసుకోవడంతో ఉగ్రవాదులను హతమార్చారు.

కాగా, శుక్రవారం కుల్గాం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను సైతం మట్టుబెట్టింది. జిల్లాలోని నాగ్‌నాద్‌-చిమ్మేర్‌ ప్రాంతంలో ఉగ్రమూకలు సంచరిస్తున్నరన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టి వారిని హతమార్చాయి. అలాగే ఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, తుపాకులను స్వాధీనం చేసున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. హతమైన వారు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు గుర్తించారు.

Next Story
Share it