బాండ్‌కు త‌ప్ప‌ని క‌రోనా కాంప్ర‌మైజ్‌..!

By సుభాష్  Published on  27 Oct 2020 7:44 AM GMT
బాండ్‌కు త‌ప్ప‌ని క‌రోనా కాంప్ర‌మైజ్‌..!

క‌రోనా దెబ్బ‌కు థియేట‌ర్లు మూత‌ప‌డి చాలా కాల‌మైంది. భార‌త్‌లో స‌హా చాలా దేశాల్లో ఇప్ప‌టికీ మెజారిటీ థియేట‌ర్లు తెర‌చుకోనేలేదు. ఇప్పుడ‌ప్పుడే థియేట‌ర్లు వెళ్లేందుకు జ‌నాలు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. త‌మ సినిమాలను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌లేక‌.. ఓటీటీల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంకా ఎక్కువ కాలం సినిమాను విడుద‌ల చేయ‌కుంటే ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుండ‌డంతో.. ఓటీటీల‌లో త‌మ సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంటున్నారు. థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు లభించాక ఓటీటీల రిలీజ్‌ల సంఖ్య మరింత పెరగడం గమనార్హం. ఇది ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఒరవడి.

చిన్న చిత్రాలే కాక‌.. ఇటీవ‌ల భారీ చిత్రాలు సైతం ఓటీటీల్లో విడుద‌ల అవుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’.. హిందీలో ‘లక్ష్మీబాంబ్’ లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ భారీ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.

డానియల్ క్రీగ్ నటిస్తున్న కొత్త జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’. ఈ సినిమాను ఒటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. డానియల్ నటించనున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇదే చివరిది. ఇకపై జేమ్స్ బండ్ సినిమాలకు దూరంగా ఉంటానన్న డానియల్. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదుదు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు హాలల్లో రిలేజ్ అవుతుందా అని చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ చిత్ర బృందం వేరే ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఓటీటీలో విడుదల చేయడానికి, ఓటీటీ ప్లాట్ ఫార్మలో సినిమా విడుదల చేయాలకున్నవారు ఓ అగ్రిమెంట్ చేయాలి. దానికోసం ఓ భారీ మొత్తం చెక్ రూపంలో ఇవ్వాలని చిత్ర బృందం కోరింది.

దాంతో ఎటువంటి నష్టాలు రావని చిత్ర యూనిట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా బ్యానర్ వారు ఓటీటీ డీల్ కోసం 600 మిలియన్ డాలర్లు కాట్టాలని అన్నారట‌. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయి. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.

Next Story