బాండ్‌కు తప్పని కరోనా కాంప్రమైజ్..!
By సుభాష్ Published on 27 Oct 2020 7:44 AM GMTచిన్న చిత్రాలే కాక.. ఇటీవల భారీ చిత్రాలు సైతం ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో సూర్య సినిమా ‘సూరారై పొట్రు’.. హిందీలో ‘లక్ష్మీబాంబ్’ లాంటి భారీ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా.. ఓ భారీ హాలీవుడ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
డానియల్ క్రీగ్ నటిస్తున్న కొత్త జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’. ఈ సినిమాను ఒటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. డానియల్ నటించనున్న జేమ్స్ బాండ్ సిరీస్‌లో ఇదే చివరిది. ఇకపై జేమ్స్ బండ్ సినిమాలకు దూరంగా ఉంటానన్న డానియల్. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదుదు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు హాలల్లో రిలేజ్ అవుతుందా అని చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ చిత్ర బృందం వేరే ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఓటీటీలో విడుదల చేయడానికి, ఓటీటీ ప్లాట్ ఫార్మలో సినిమా విడుదల చేయాలకున్నవారు ఓ అగ్రిమెంట్ చేయాలి. దానికోసం ఓ భారీ మొత్తం చెక్ రూపంలో ఇవ్వాలని చిత్ర బృందం కోరింది.
దాంతో ఎటువంటి నష్టాలు రావని చిత్ర యూనిట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా బ్యానర్ వారు ఓటీటీ డీల్ కోసం 600 మిలియన్ డాలర్లు కాట్టాలని అన్నారట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునేందుకు యాపిల్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రూ.4 వేల కోట్లకు పైగానే ఖర్చు చేయడానికి ముందుకొచ్చాయి. ఇదే నిజమైతే మాత్రం ప్రపంచ సినీ రంగంలో ఓ సంచలనం అయ్యే అవకాశముంది.