చిత్తూరు జిల్లాలో విషాదం.. జల్లికట్టులో ఒకరి మృతి
By Newsmeter.Network Published on 12 Jan 2020 2:12 PM IST
చిత్తూరు : సంక్రాంతి పండుగ నెల రోజుల ముందు నుంచే జల్లి కట్టు మొదలైపోతోంది. జల్లి కట్టు ఆడేందుకు యువకులు పోటీ పడుతుంటారు. చాలా సందర్భాల్లో ఈ క్రీడ ఆడుతూ పలువురు మరణించడంతో పాటు ఎంతో మంది తీవ్రంగా గాయపడుతుంటారు. అయినా కానీ ఈ క్రీడ పట్ల ఆసక్తి తగ్గక పోగా ఎప్పటికప్పడు పెరగుతుండడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లి కట్టులో ఓ యువకుడు మృతి చెందాడు.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామకుప్పం మండలం చిన్నబల్దారు గ్రామంలో జల్లి కట్టును నిర్వహించారు. జల్లి కట్టులో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అయితే ఈ రాక్షస క్రీడలో ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ జల్లి కట్టుకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. మరోవైపు పోటీలు జరుగుతున్న చోట ఎక్కడ కూడా అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో లేవు.