జెయింట్ వీల్‌లో ఇరుక్కుని యువకుడి మృతి..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sept 2019 5:43 PM IST
రంగారెడ్డి జిల్లా : శంకర్ పల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది వైల్డ్ వాటర్ పరిసరాల్లో విషాదం అలుముకుంది. జెయింట్ వీల్ ఇరుక్కొని అందులో పనిచేసే యువకుడు మృతి చెందాడు. ప్రాణాలు కోల్పోయిన యువకుడిని శ్రీకాంత్ గౌడ్(20)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతోపాటు ..అందులో పనిచేసే ఉద్యోగులు వైల్డ్ వాటర్ గేట్ ముందు ధర్నాకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయన్నారు. అయితే..యాజమాన్యం బయటకు రానివ్వడంలేదని తెలిపారు. వైల్డ్ వాటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story