'టెర్రరిస్తాన్‌'తో చర్చలా? ఎందుకు?- విదేశాంగ మంత్రి జైశంకర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 7:47 AM GMT
టెర్రరిస్తాన్‌తో చర్చలా? ఎందుకు?- విదేశాంగ మంత్రి జైశంకర్‌

న్యూయార్క్‌: భారత్‌కు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందంటూ జీ4 సమావేశంలో మండిపడ్డారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే టెర్రరిస్తాన్‌తో చర్చలు ఎలా జరపాలని ప్రశ్నించారు. న్యూయార్క్‌లో జరిగిన జీ4(భారత్, జపాన్‌, జర్మని, బ్రెజిల్) విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఉంది. కాని.. పాకిస్తాన్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగా భారత్‌కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందన్నారు జైశంకర్‌. పాకిస్థాన్‌ ఉగ్రవాద పరిశ్రమను తెరిచిందంటూ మండిపడ్డారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపడానికి భారత్‌కు అభ్యంతరం లేదని..టెర్రరిస్తాన్‌తో చర్చలు జరపాలనుకోవడమే పెద్ద సమస్య అన్నారు జై శంకర్‌. అంతేకాదు.. పాక్‌ పెంచిపోషించిన ఉగ్రవాదులు భారత్‌లో చేసిన దాడుల గురించి సభ్యదేశాలకు విదేశాంగ మంత్రి వివరించారు. "రాత్రి ఉగ్రవాదం, పగలు క్రికెట్ అంటే ఎలా" అని ప్రశ్నించారు విదేశాంగ మంత్రి జైశంకర్.

Next Story