నేడు కోర్టుకు జగన్
By సుభాష్Published on : 7 Feb 2020 8:45 AM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సీబీఐ,ఈడీ కోర్టకు హాజరు కానున్నారు. సీబీఐ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్లు, ఈడీ వేసిన ఐదు అభియోపత్రాలపై విచారణ జరగనున్న నేపథ్యంలో జగన్ హాజరు కానున్నారు. కాగా, జగన్ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోర్టుకుబయలుదేరనున్నారు. పదిన్నర గంటలకు కోర్టకు హాజరవుతారు. ఇక విచారణ అనంతరం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు గతంలోనే నిరాకరించిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన వాజ్యాలపై తెలంగాణ హైకోర్టు ఈనెల 12న విచారణ జరగనుంది.
Next Story