కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి కన్నుమూత

By సుభాష్  Published on  5 Sep 2020 2:18 AM GMT
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి (70) ఆరోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుండెకు స్టంట్‌ వేయించుకున్న జగదీశ్వర్‌రెడ్డి.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

అయితే తొలి దశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. మాజీ సీఎం చెన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి మల్లిఖార్జున్‌ అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో జైలు కూడా వెళ్లారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు.

Next Story