చైనాతో పాటు ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. నిజానికి ఇది కూడా ప్రకృతి ప్రకోపానికే వచ్చిందనుకోవాలి. చైనాలో మాంసాహారమంటే మనలాగా ఏ కోడి మాంసమో..మేక మాంసమో తినరు కదా..ఏది దొరికితే అదే..అది విషజంతువా..సాదు జంతువా అన్న తేడా చూడరు. అలా తినడం వల్లే అక్కడ కరోనా వైరస్ వ్యాపించిందంటూ చాలా మంది చైనాకు వ్యతిరేకంగా…అక్కడి వారిని తిడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు. ఇప్పటి వరకూ 1000మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా..40 వేల మందికి పైగా కరోనాతో ఆస్పత్రుల పాలయ్యారు. కరోనాకు విరుగుడు మందు కనిపెట్టడం చైనా వల్ల కావట్లేదు. చైనానే కాదు..ప్రపంచ దేశాలేవీ కరోనా విరుగుడు మందు కనిపెట్టడంలో సఫలమవ్వలేదు. మందు కనిపెట్టేందుకు శాస్ర్తవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు.

దీనిపై సూపర్ స్టార్ జాకీ చాన్ స్పందించారు. ఆయన ఒకడుగు ముందుకేసి వుహాన్ ప్రజలకు మాస్క్ లను పంపిణీ చేశారు. అలాగే కరోనాకు విరుగుడు మందు కనిపెట్టిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. సైన్స్, సాంకేతిక వర్గం కలిస్తే వైరస్ కు పరిష్కారం దొరుకుతుందన్నారు. దీనికి త్వరలోనే విరుగుడు దొరుకుతుందని ఆశిస్తున్నానని, మందు కనిపెట్టే సత్తా చాలా మందిలో ఉందని తాను నమ్ముతున్నానన్నారు. ఈ వ్యాధికి మందు ఎవరు కనిపెట్టినా…వారికి కోటి రూపాయలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.