జబర్థస్త్ కి నాగబాబు గుడ్ బై చెప్పేసారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Nov 2019 5:30 AM GMT
జబర్థస్త్ పొగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జబర్థస్త్ అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు నాగబాబు. ఇప్పుడు నాగబాబు జబర్థస్త్ నుంచి బయటకు వచ్చేసారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటారా..? ఈ షోకు ఎంతో కీలకమైన నితిన్ & టీమ్ ఇగో ప్రొబ్లమ్ వలన బయటకు వచ్చేసినట్లు సమాచారం.
వీళ్లు జీటీవీకి వెళ్లి జబర్థస్త్ లాంటి షో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. జబర్థస్త్ నుంచి కొంత మంది తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే చమ్మక్ చంద్రకు స్కిట్ కి రెండు లక్షలు ఆఫర్ చేశారు. దీంతో చమ్మక్ చంద్ర జబర్థస్త్ కి నో చెప్పేసి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగిలిన వాళ్లు కూడా వెళ్లిపోతారేమో అనే ఉద్దేశ్యంతో జబర్థస్త్ యాజమాన్యం అందరితో అగ్రిమెంట్లు రాయించుకున్నట్లు సమాచారం.
అయితే నాగబాబుని కూడా అగ్రిమెంట్ చేయమన్నారని సమాచారం. దీంతో ఆయన నచ్చక అగ్రిమెంట్ చేయలేదని తెలుస్తోంది. కాగా.. దీనికి బాగా హార్ట్ అయిన నాగబాబు రెండు రోజుల నుంచి జబర్థస్త్ షోకు వెళ్లడం లేదు. అంతే కాకుండా.. ఇక జబర్థస్త్ కు వెళ్లను అని నాగబాబు సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం.