కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 ఐటీ అధికారులతో కూడిన గ్రూప్ కడప ద్వారకానగర్ లోని నివాసంలో దస్తావీజులను పరిశీలించింది. అలాగే శ్రీనివాసుల రెడ్డి వ్యాపారానికి సంబంధించిన రికార్డులను తరలించారు. ఆయన సకాలంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా..లేదా ?అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఎవరినీ ఇంట్లోకి రానివ్వకుండా పోలీసులు తలుపులు మూసివేసి కాపలా ఉన్నారు.

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా పేరుమోసిన కాంట్రాక్టర్. ఆయన తన ఆదాయానికి తగిన పన్ను చెల్లించలేదని ఆరోపణలొచ్చిన నేపథ్యంలోనే సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. శ్రీనివాస్ ఇంట్లోని రికార్డులు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను పరిశీలించారు. అలాగే హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో ఉన్న నివాసంతో పాటు పంజాగుట్టలో ఉన్న ఆర్ కే ఇన్ర్ఫా కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.