ఇంతింతై వటుడింతై అన్నట్టు అనేకానేక అంతరిక్ష ఘన విజయాలను నమోదు చేసుకున్న ఇస్రో రానున్న సంవత్సరంలో “గగన మండలమెల్ల గప్పికొనేందుకు” ఆకాశంలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. గగన విజయాల పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళ్లేందుకు నడుం కడుతోంది.

2020 లో పదికి పైగా ప్రత్యేక శాటిలైట్ కార్యక్రమాలను, గ్రహాంతర ఆదిత్య మిషన్ ను, మానవ రహిత గగనయాన్ మిషన్ ను ఇస్రో చేపట్టబోతోంది. జీ ఐ సాట్, జీ ఐ సాట్ 12 ఆర్, భూమిపై నిఘా ఉంచే రిసాట్ 2 బీ ఆర్ 2 , గూఢచర్యానికి ఉపయోగపడే మైక్రో సాట్, ఆదిత్య ఎల్ ఐ వంటి సాటిలైట్లను ప్రయోగించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. మానవ రహిత గగన యాన్ కూడా 2020 లో జరగనుందని ఆయన తెలిపారు.

ఆదిత్య ఎల ఈ మిషన్ ద్వారా సూర్యుని చుట్టు ఉండే కరోనా అగ్ని వలయంపై అధ్యయనాలు నిర్వహించడానికి వీలు పడుతుంది. నాలుగు వందల కిలోల పేలోడ్ ఉన్న పీ ఎస్ ఎల్ వీ వాహకం ఆరు పే లోడ్ లను తీసుకు వెళ్లి, సూర్యుని చుట్టు ఉన్న హాలో లోని లాగ్రాంగియన్ పాయింట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది భూతలం నుంచి 1.5 మిలియన్ల కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి సూర్యుడిని అధ్యయనం చేయడం, గ్రహణాల సమయంలో పరిశీలించడం వంటివి చేయడానికి వీలుంటుంది. ఒకసారి కన్నా ఎక్కువసార్లు ఉపయోగించగలిగే రీయూజబుల్ లాంచ్ వెహికిల్, కొత్తగా రూపొందించిన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ లను కూడా ప్రయోగించడం జరుగుతుంది. వీటి ద్వారా రాకెట్లలోని ఫస్ట్ , సెకండ్ స్టేజ్ లను తిరిగి ఉపయోగించేందుకు వీలు కలుగుతుంది. కాబట్టి మన గగనం ఈ ఏడాది గఘనం కాబోతోందన్నమాట.

Newsmeter.Network

Next Story