సికింద్రాబాద్:కొల్‌కతా మాయాపూర్ లో వంద మిలియన్ల దాలర్ల వ్యవయంతో కృష్ణ మందిర్ నిర్మిస్తున్నారు. విరాళాల సేకరణలో భాగంగా ఫోర్డ్ కంపెనీ మనమడు, టెంపుల్ ఆఫ్ వైదిక్‌ ప్లానిటోరియం ప్రెసిడెంట్ హెచ్‌ డీ అంబరీష్ దాస్ (అల్ఫాడ్ ఫోర్డ్) సికింద్రాబాద్ ఇస్కాన్ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇస్కాన్‌ స్థాపక చైతన్య మహా ప్రభు దాస్ అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కృష్ణ దాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రచారకర్త వెంకటపతి దాసు మాట్లాడుతు..అంబరీష్ దాస్..టెంపుల్ నిర్మాణానికి రూ.300 కోట్లు విరాళం ఇచ్చారని తెలిపారు. కోల్‌కతాలో వెయ్యి కోట్లతో భారీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story