సుశాంత్ నిర్ణ‌యం స‌రైన‌దేనా..?

By Medi Samrat  Published on  22 Oct 2019 11:44 AM GMT
సుశాంత్ నిర్ణ‌యం స‌రైన‌దేనా..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ 'కాళిదాసు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత క‌రెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా... సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఏ సినిమా కూడా అత‌నికి విజ‌యాన్ని అందించ‌లేదు. గ‌త సంవ‌త్స‌రం రిలీజైన‌ 'చి.ల‌.సౌ' సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని హ‌మ్మ‌య్యా.. సుశాంత్ కి స‌క్సెస్ వ‌చ్చింది అనిపించింది. నెక్ట్స్ మూవీ ఎవ‌రితో చేయ‌నున్నాడు అని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల‌కు షాక్ ఇచ్చాడు.

Related image

అదే.. బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' న‌టించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం. స‌క్సెస్ రాక ముందు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు అంటే ఓకే కానీ... స‌క్సెస్ వ‌చ్చిన త‌ర్వాత ఇలా వేరే హీరో సినిమాలో క్యారెక్ట‌ర్ చేయ‌డం ఏంటి..? ఫ‌్యాన్స్ కి ఇదే అర్ధం కాలేదు. ఇందులో సుశాంత్ పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని.. అదీ కాకుండా దీనికి త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ కావ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న ఇందులో న‌టించేందుకు ఓకే చెప్పాడ‌ని తెలిసింది.

Image result for ala vaikuntapuramlo

గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమా పై బ‌న్నీ ఎంత న‌మ్మ‌కం పెట్టుకున్నాడో.. సుశాంత్ కూడా అంతే న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. త‌న కెరీర్ కి ఎంత‌గానో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాడు. మ‌రి..సుశాంత్ నిర్ణ‌యం సరైన‌దేనా..? అత‌ని న‌మ్మ‌కం నిజ‌మౌతుందా..? లేదా..? అనేది తెలియాలంటే జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story