నిజమెంత: ప్రజలు కోవిద్-19 అప్డేట్స్ ఇవ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందా..?

By సుభాష్  Published on  9 April 2020 8:37 AM GMT
నిజమెంత: ప్రజలు కోవిద్-19 అప్డేట్స్ ఇవ్వకుండా భారత ప్రభుత్వం అడ్డుకుంటోందా..?

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. కొన్ని కోట్ల మంది జీవితాల్లో తెలియని సందిగ్ధం నెలకొంది. చాలా దేశాలు తమ తమ దేశాలను లాక్ డౌన్ లో ఉంచాయి. భారత్ 21 రోజుల లాక్ డౌన్ ను అమలు లోకి తెచ్చింది. ఏప్రిల్ 14కు పూర్తవ్వచ్చని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

India has implemented the Disaster Management Act (DMA) across the country has been doing the rounds. The message claims that according to the Act, apart from government departments, no citizen can post any update or share any forward related to the Corona virus.



ఇలాంటి సమయంలో "భారత్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్(డి.ఎం.ఏ.) ను అమలు చేస్తారనే వార్త వైరల్ అవుతోంది. ఈ యాక్ట్ ప్రకారం భారత ప్రభుత్వం మినహా.. ఏ ఒక్కరు కూడా కరోనా వైరస్ కు చెందిన అప్డేట్లను పోస్టు చేయడానికి వీలు లేదు" అన్నది వైరల్ అవుతోంది.

Covid19

అలాంటి మెసేజే మరొకటి www.livelaw.com లింక్ ఇచ్చి వైరల్ చేస్తున్నారు.

According to LiveLaw’s report filed on 31 March, the Central government had sought a direction from the Supreme Court to prohibit the publication of COVID-19 related news by media outlets, unless the facts are ascertained by the mechanism established by the government. But it is important to note that the Supreme Court refused to give any such directive in favour of the government.

అర్ధరాత్రి 12 గంటల నుండి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను దేశం మొత్తం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క ప్రభుత్వం తప్ప మిగిలిన ఏ ఒక్కరు కూడా కర్ణా వైరస్ కు సంబంధించిన విషయాలను షేర్ చేయడానికి వీలు లేదు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీలు లేదు. ఎవరైనా అలా కాదని షేర్ చేశారో.. వారిని ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది అని అన్నారు.

Covid 19

అలాగే ప్రతి ఒక్క గ్రూప్ అడ్మిన్స్ ఈ విషయాన్ని తమ తమ గ్రూపుల్లో పోస్టు చేయాలని సూచించారు. ఈ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో నిజమెంత:

పైన చెప్పిన ఫార్వర్డ్ మెసేజ్ లు మొత్తం 'పచ్చి అబద్దాలే'

కేంద్ర ప్రభుత్వం మార్చి 24న, 21 రోజుల లాక్ డౌన్ ను అనౌన్స్ చేసిన సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005 ను ఆధారంగా చేసుకుని కరోనా మహమ్మారితో పోరాడడానికి సిద్ధమవుతున్నామని తెలిపింది.

Covid

కరోనా వైరస్ కు సంబంధించిన అప్డేట్లను కేవలం ప్రభుత్వం మాత్రమే తెలియజేయాలన్న విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు.

మార్చి 31, 2020న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో.. కరోనా వైరస్ గురించి మీడియా పబ్లిష్ చేయడానికి, టెలీకాస్ట్ చేయడానికి ముందు ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకునేలా ఆర్డర్స్ ఇవ్వాలని అభ్యర్థించింది. కానీ ప్రభుత్వం కోరుకున్నట్లు కాకుండా.. మీడియాకు స్వేచ్ఛనిస్తూ కరోనా గురించి నిజ నిర్ధారణ చేసుకుని వార్తలు వేయొచ్చని.. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన వెర్షన్ ను, డెవలప్మెంట్స్ ను ప్రజలకు అందించాలని ఆర్డర్ ను పాస్ చేసింది.



అంతేకానీ.. ప్రజలు కోవిద్-19 వైరస్ కు సంబంధించిన వార్తలను షేర్ చేయకూడదని.. తెలియజేయకూడదని ఎక్కడా కూడా లేదు. షేర్ చేసే ముందు అవి నిజమా కాదా.. ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులా అన్నది తెలుసుకుని షేర్ చేస్తే అందరికీ మంచిది.

LiveLaw కూడా ఆ లింక్ లో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గురించే ప్రస్తావించింది. కానీ షేర్లు మాత్రం తప్పుడు సమాచారం పైన ఇచ్చి షేర్ చేస్తున్నారు. మిస్-కోట్ చేస్తూ ప్రచారం చేస్తున్న ఈ వార్త 'అబద్దం' అని ఆ సంస్థ కూడా తెలిపింది.

https://www.livelaw.in/top-stories/fake-news-alert-news-that-no-person-apart-from-govt-is-allowed-to-share-or-post-covid-19-updates-is-false-154767

PIB ఫ్యాక్ట్ చెక్ కూడా.. ఇదంతా పచ్చి అబద్దం అని తేల్చేసింది.

Next Story