కరోనా వైరస్ సోకి ఇరాన్ ఎంపీ ఒకరు మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇటీవలే కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన ఫాతిమా రహ్బర్ (55) కరోనా కారణంగా మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ అక్కడ కరోనా బాధితులు 4,747మంది ఉండగా..124 మంది మృతి చెందారు.

మరోవైపు జమ్మూ లో ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మొదట వారిద్దరికీ వైద్య పరీక్షలు చేయగా వైరల్ లోడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తర్వాత చేసిన పరీక్షల్లో కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలెక్కువగా ఉండటంతో..స్పెషల్ వార్డులో ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి, మరొకరు దక్షిణ కొరియాకు వెళ్లొచ్చినట్లు సమాచారం. మొదట ఐసోలేషన్ వార్డు నుంచి వీరిద్దరూ పారిపోగా ఆస్పత్రి సిబ్బంది వెతికి పట్టుకున్నారు. ప్రస్తుతం జమ్మూ, సాంబా జిల్లాల్లోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం నుంచి ఉపశమనమిచ్చారు. ఈ నెలాఖరు వరకూ ఉద్యోగుల హాజరు రిజిస్టర్ లోనే వేయనున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.