ఘోరం: సొంత నౌకను పేల్చేసిన ఇరాన్‌.. 19 మంది మృతి

By సుభాష్  Published on  11 May 2020 5:34 PM IST
ఘోరం: సొంత నౌకను పేల్చేసిన ఇరాన్‌.. 19 మంది మృతి

ఇరాన్‌లో దారుణం చోటు చేసుకుంది. నావికదళాలు విన్యాసాలు చేస్తున్న క్రమంలో ఇరాన్‌ పొరపాటున తన సొంత నౌకను పేల్చేసింది. మిస్సైల్‌ పరీక్ష చేపట్టిన ఇరాన్‌ గార్డ్స్‌.. ఓ లాజిస్టిక్స్‌ నౌకను పేల్చివేసింది. శిక్షణలో భాగంగా ఆదివారం సాయంత్రం పర్షియల్‌ గల్స్‌ జలాల ప్రాంతంలో ఇరాన్‌ యుద్ద నౌక జమరాన్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది నావికులు మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఫ్రిగేట్ జ‌మర‌న్‌.. తాజాగా యాంటీ షిప్‌ మిస్సైల్ ప‌రీక్ష చేప‌ట్టింది.

అయితే ఆ మిస్సైల్‌ పొరపాటున కొనరాక్‌ అనే నౌకను టార్గెట్‌ చేస్తూ లాక్‌ చేసేసింది. ఫ్రిగేట్‌ను ప్రయోగించిన ఇరాన్‌.. ఆ ప్రమాదానికి అరికట్టలేకపోయింది. ఈ ఘటన ఓ ప్రమాదంగా ఆ దేశం పేర్కొంది.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారని స్పష్టత లేదు. నెదర్లాండ్‌ తయారు చేసిన కొనరాక్‌ నౌకను 1979 సంవత్సరం కన్నా ముందే ఇరాన్‌ కొనుగోలు చేసింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకూ సేవలందిస్తోంది.

అయితే ఈ ఏడాది టెహ్రాన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని ఇరాన్‌ పొరపాటున పేల్చివేసిన విషయం తెలిసిందే. ఇక అమెరికా నౌకలకు ఇరాన్‌ అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్‌ నౌకలనే పేల్చివేయాలని అగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు ఇవ్వగా, ఇరాన్‌ తన సొంత నౌకపైనే క్షిపణి ప్రయోగించింది.

Next Story